తెలంగాణ వైతాళికుల పేరిట తెలుగు ఏకరూప ఖతుల (యూనికోడ్ ఫాంట్స్) రూపకల్పనకు ప్రతిపాదనల ఆహ్వానం

Telangana State Emblem

తెలంగాణ వైతాళికుల పేరిట తెలుగు ఏకరూప ఖతుల
(యూనికోడ్ ఫాంట్స్) రూపకల్పనకు ప్రతిపాదనల ఆహ్వానం

డిసెంబర్ 15, 2017 నుండి డిసెంబర్ 19, 2017 వరకూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైతాళికుల పేరిట ఏకరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్స్) విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ సంకల్పించింది.

ఇందుకొరకు ఏకరూప ఖతుల రూపకల్పనలో తగిన అనుభవం, ప్రావీణ్యం ఉన్న ఔత్సాహికుల/సంస్థల నుండి ప్రతిపాదనలు కోరుతున్నాం. మీ ప్రతిపాదన పంపేటప్పుడు అందులో దిగువ వివరాలు పొందుపరచగలరు:

  • ఏకరూప ఖతికి మీరు ప్రతిపాదించే పేరు
  • ఏకరూప ఖతి నమూనా
  • ఏకరూప ఖతి రూపకల్పనకు అయ్యే ఖర్చు
  • ఏకరూప ఖతి ఇప్పటివరకూ ఉచితంగా కానీ, రుసుముకు గానీ ఇతరులెవ్వరికీ అందుబాటులో లేదని హామీపత్రం
  • ఏకరూప ఖతి తమ స్వంత తయారీ అని, ఇతరుల మేధోసంపత్తిని చౌర్యం చేయలేదని హామీ పత్రం
  • ఒకవేళ ఏకరూప ఖతి ఎవరైనా వైతాళికుల/లబ్దప్రతిష్టుల దస్తూరిని పోలి ఉండేటట్టయితే ఆ వివరాలు
  • వచ్చిన ఖతులను ఒక న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేస్తుంది. దానికి సరైన పేరును కూడా న్యాయనిర్ణేతలు ఖరారు చేస్తారు

ప్రతిపాదనలు పంపడానికి చివరి తేదీ డిసెంబర్ 5, 2017. మీ ప్రతిపాదనలు ఈ దిగువ చిరునామాకు ఇ-మెయిల్/సిడి/సీల్డ్ కవర్ ద్వారా పంపగలరు:

సంచాలకులు – డిజిటల్ మీడియా
ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ
గది 424 బి
మూడవ అంతస్థు
డి – విభాగం
తెలంగాణ రాష్ట్ర సచివాలయం
ఇ-మెయిల్: dir_dm@telangana.gov.in
Director – Digital Media
IT, Electronics & Communications Dept.
Room 424 B
D Block
Telangana State Secretariat
Email: dir_dm@telangana.gov.in